
పుష్ప-2 నిర్మాతలకు షాక్ ఇచ్చిన ప్రేక్షకులు
సినిమా బాగుంటే ఆడించడానికి ప్రేక్షకుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. కానీ అదే సినిమా బాగుంది కదా అని ఇష్టానుసారంగా డబ్బులు పిండుకోవచ్చని విచ్చలవిడిగా రేట్లు పెంచి క్యాష్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎవరు సహించే పరిస్థితులు అయితే లేవని నిన్న విడుదలైన పుష్ప-2 సినిమా విషయంలో మనకు చెప్పకనే చెబుతుంది.
ఇది మా సినిమా మా ఇష్టం వచ్చినట్లు రేట్లకు అమ్ముతాం… చూస్తే చూడండి లేకపోతే లేదని నిర్మాతలు సగటు ప్రేక్షకుడి మాట లెక్కచేయకుండా తీసుకున్న నిర్ణయానికి ఇది కచ్చితంగా తిరుగుబాటే అని చెప్పుకోవచ్చు.